Ramgopal Varma: ఇవాళ విచారణకు వద్దు... రాంగోపాల్ వర్మకు సీసీఎస్ సమాచారం

  • తొలి విచారణ తరువాత వర్మ ల్యాప్ టాప్ సీజ్
  • ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ లో ల్యాప్ టాప్
  • ఇంకా రాని నివేదిక
  • రిపోర్టు వచ్చిన తరువాతే విచారించాలని పోలీసుల నిర్ణయం

నేడు విచారణకు రానవసరం లేదని, మార్చి తొలివారంలో తాము ఓ తేదీని ఇస్తామని, ఆ రోజుకు వస్తే సరిపోతుందని హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల నుంచి దర్శకుడు రాంగోపాల్ వర్మకు సమాచారం వెళ్లింది. జీఎస్టీ షార్ట్ ఫిల్మ్ తరువాత, ఓ టీవీ చానల్ లో చర్చలో పాల్గొని మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదు కాగా, గతవారం ఆయన్ను విచారించిన పోలీసులు, తిరిగి నేడు మరోసారి రావాలని కోరిన సంగతి తెలిసిందే.

తొలి దశ విచారణ తరువాత వర్మ ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ల్యాప్ టాప్ పై ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇంకా రాకపోవడంతో, ప్రస్తుతం ఆయన్ను ప్రశ్నించేందుకు ఏమీ లేదని భావించిన సీసీఎస్ పోలీసులు, రిపోర్టు వచ్చేంత వరకూ వేచి చూడాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమాచారాన్ని రెండు రోజుల క్రితమే వర్మకు తెలిపినట్టు సీసీఎస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇవాల్టి విచారణ నుంచి రాంగోపాల్ వర్మకు మినహాయింపు లభించినట్లయింది.

More Telugu News