Chandrababu: రాష్ట్రానికి నిధులివ్వకపోతే కేంద్రాన్ని వదిలిపెట్టను: సీఎం చంద్రబాబు
- నిధుల విషయంలో ఏపీకి న్యాయం చేయాలి
- ఏపీ ప్రజలందరూ ఒకే తాటిపై ఉన్నారు
- తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన చరిత్ర మా ప్రజలది
- తప్పుడు ప్రచారం చేసే వారిని పట్టించుకోను: చంద్రబాబు
రాష్ట్రానికి నిధులివ్వకపోతే కేంద్రాన్ని వదిలిపెట్టనని, పోరాడి సాధిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఏపీకి నిధుల విషయంలో న్యాయం చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఆంధ్రా ప్రజలందరూ ఒకే తాటిపై ఉన్నారని, తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన చరిత్ర ఏపీ ప్రజలదని అన్నారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని పట్టించుకునే పనే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.