Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపురూప జ్ఞాపిక బహూకరణ

  • నాడు తిరుపతి స్కూలులో చదువుకున్న చంద్రబాబు
  • ఆ ఛాయా చిత్రాలతో ఓ జ్ఞాపికను రూపొందించిన మిస్డ్ కాల్ అండ్ ఎలైడ్ ప్రాజెక్ట్స్ సంస్థ
  • అమరావతి అభివృద్ధి నిధికి ‘ది రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ విరాళం
  • ఏపీ మీడియా ఫెడరేషన్ 2018 వార్షిక డైరీ ఆవిష్కరణ

సీఎం చంద్రబాబుకు తన చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఆయనకు ఓ అరుదైన జ్ఞాపికను మిస్డ్ కాల్ అండ్ ఎలైడ్ ప్రాజెక్ట్స్ సంస్థ వ్యవస్థాపకులు అందజేశారు. చంద్రబాబును సచివాలయంలో ఈరోజు వారు కలిశారు. తిరుపతిలో 1958లో టి.పి.పి.ఎం స్కూలులో చంద్రబాబు చదువుకున్నప్పటి ఛాయాచిత్రాలతో ఈ జ్ఞాపికను రూపొందించారు. దీనిని చంద్రబాబుకు మిస్డ్ కాల్ అండ్ ఎలైడ్ ప్రాజెక్ట్స్ సంస్థ వ్యవస్థాపకులు కిశోర్ శ్రీరామ్ భట్ల, శేషాచలపతి వేల్పుల బి.చంద్రశేఖర్, గిరిధర్ ఆలూరి, బి.రాజశేఖర్ అందజేశారు.  ఇదిలా ఉండగా, అమరావతి అభివృద్ధి నిధికి ‘ది రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ. 2 లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబును వారు కలిశారు. కాగా, ఏపీ మీడియా ఫెడరేషన్ 2018 వార్షిక డైరీని కూడా చంద్రబాబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ మీడియా ఫెడరేషన్ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు.

  • Loading...

More Telugu News