Andhra Pradesh: ఏపీకి ప్రత్యేక హోదా రాదు..ప్యాకేజ్ వస్తుంది!: టీడీపీ ఎంపీ జేసీ

  • వైసీపీ రాజీనామాల డ్రామా ఆడుతోంది
  • అవి ఆమోదం పొందే లోపే ఎన్నికల కోడ్ వస్తుంది: టీడీపీ నేత జేసీ
  • వైసీపీ తమ ఎంపీలతో ఈరోజే రాజీనామా చేయించాలి
  • చంద్రబాబు నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం: చినరాజప్ప

ఏపీకి ప్రత్యేక హోదా రాదని, కేవలం ప్రత్యేక ప్యాకేజ్ మాత్రం వస్తుందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు. తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామంటూ వైసీపీ డ్రామాలు ఆడుతోందని, ఒకవేళ వారు రాజీనామాలు చేసినా, అవి ఆమోదం పొందే లోపే ఎన్నికల కోడ్ వస్తుందని అన్నారు.

కాగా, ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై జగన్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఈరోజే వైసీపీ తమ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చినరాజప్ప అన్నారు.

  • Loading...

More Telugu News