Andhra Pradesh: అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు మేము సిద్ధం: ఎమ్మెల్సీ సోము వీర్రాజు
- విజయవాడలో బీజేపీ నేతల కీలక సమావేశం
- ఢిల్లీ లాంటి అభివృద్ధిని ఏపీకి అందించాం
- ఏపీ అభివృద్ధిపై ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు: వీర్రాజు
- ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలపై షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన
ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయంపై ప్రజల్లోకి వెళ్లి చెబుతామని, అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు తాము సిద్ధమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో జరిగిన బీజేపీ నేతల కీలక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ లాంటి అభివృద్ధిని ఏపీకి అందించామని, రాష్ట్రం విడిపోతేనే అభివృద్ధి జరిగిందని అన్నారు.
తాము అవినీతిపరులం కాదని, అభివృద్ధిని కోరుకునేవాళ్లమని, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేస్తోందని, ఏపీ అభివృద్ధిపై ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, ఏపీకి చేసిన న్యాయంపై బీజేపీ సమావేశంలో షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏపీ పరిస్థితుల నుంచి ప్రస్తుత పరిస్థితుల వరకు ఈ షార్ట్ ఫిల్మ్ లో చూపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నిధుల వివరాలతో పాటు, ఇంకా ఏపీకి ఏం చేయబోతున్నారనే విషయాలపై షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించినట్టు సమాచారం.