madhubabu: నేను రాసిన కథతో త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడనేది అవాస్తవం!: రచయిత మధుబాబు
- త్రివిక్రమ్ నన్ను కథ అడగలేదు
- నా నవలతో సినిమా చేయడం లేదు
- ఇదంతా కేవలం పుకారే
రచయిత మధుబాబు పేరు వినగానే ఆయన వ్రాసిన 'షాడో' నవలలు కళ్లముందు కదలాడతాయి. నవల చదువుతోన్న పాఠకుడికి సినిమానే కనిపించేలా వ్రాయడం ఆయన ప్రత్యేకత. అలాంటి మధుబాబు తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, ఆసక్తికరమైన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
" ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయనున్న సినిమాకి నేను కథ ఇస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ప్రముఖ దిన పత్రికతో పాటు చాలా వెబ్ సైట్స్ లో ఈ వార్త చూశాను. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. నాకు తెలిసిన వాళ్లంతా నిజమా? కాదా? అంటూ వరుసగా ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అలాంటిదేంలేదని అందరికీ చెప్పుకుంటూ రావలసి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ చక్కని నటుడు .. ఆయనకి ఒక కథ ఇవ్వాలంటే అందుకు ఎంతో అనుభవం ఉండాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఒక కథ చెప్పేసి ఒప్పించాలంటే చాలా తెలివితేటలు ఉండాలి .. క్రియేటివిటీ టాప్ మోస్ట్ లో ఉండాలి. అలాంటి ఆయనకి కథ చెప్పడం సామాన్యమైన విషయం కాదు" అని చెప్పారు.