Chandrababu: జగన్ కీలక నిర్ణయంపై అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు భేటీ

  • తమ లోక్‌సభ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్‌ ప్రకటన
  • తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చ
  • వైసీపీ అర్థరహిత వ్యాఖ్యలు చేస్తోంది: టీడీపీ నేతలు

తమ లోక్‌సభ సభ్యులతో ఏప్రిల్ 6న రాజీనామా చేయిస్తానంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, ఆనందబాబు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు.

వైసీపీ అర్థరహిత వ్యాఖ్యలు చేస్తోందని, వారు చేస్తోన్న వ్యాఖ్యలను తిప్పికొడతామని టీడీపీ నేతలు అంటున్నారు. బీజేపీతో మిత్ర పక్షంగా ఉన్నప్పటికీ తాము పోరాడుతున్నామని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు కీలక చర్చ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News