nagarjuna: నాగ్ .. నానీల మల్టీస్టారర్ లో కన్నడ భామ!

  • శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్ 
  • హీరోలుగా నాగార్జున - నాని 
  • హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ 
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్

ప్రస్తుతం నాగార్జున .. నాని ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీగా వున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ రూపొందనుంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అందుకు సంబంధించిన పనుల్లో బిజీగా వున్నాడు. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

 డాన్ గా నాగ్ .. డాక్టర్ గా నాని కనిపించనున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండనున్నారు. ఒక కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ .. కన్నడ సినిమాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అందాల భామ, ఈ స్క్రిప్ట్ పట్ల సుముఖతను వ్యక్తం చేసిందని అంటున్నారు. ఇక మరొక హీరోయిన్ గా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది చూడాలి.  

More Telugu News