: యడ్యూరప్ప అనుంగురాలు కరంద్లాజె పరాజయం


మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు గట్టి దెబ్బ తగిలింది. ఆయనకు అత్యంత దగ్గర మనిషి, అనుచరురాలు శోభా కరంద్లాజె బెంగళూరులోని రాజాజీ నియోజకవర్గంలో ఓడిపోయారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉండగా, కరంద్లాజెకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో తన మంత్రులతో విభేదించారు. వారు వ్యతిరేకిస్తున్నా ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టారు. బీజేపీని వీడి ప్రత్యేక పార్టీ పెట్టుకున్నప్పటికీ కరంద్లాజెను గెలిపించుకోవడంలో యడ్యూరప్ప విఫలమయ్యారు.

  • Loading...

More Telugu News