: హస్తానికి అధికారం ఖాయం
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే కాంగ్రెస్ కు స్పష్టమైన అధికారం ఖాయమని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుకు 113 స్థానాలు కావాల్సి ఉంది. అయితే, కాంగ్రెస్ ఇప్పటికే 32 స్థానాలను గెలుచుకుని మరో 84 స్థానాలలో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ స్థానాలలోనూ గెలిస్తే కాంగ్రెస్ ఖాతాలో 116 స్థానాలు వచ్చి చేరతాయి. అప్పుడు సంపూర్ణ ఆధిపత్యం కాంగ్రెస్ సొంతమవుతుంది. అధికారం కోసం మరో పార్టీని దువ్వాల్సిన పని ఉండదు. దీనివల్ల సుస్థిర పాలనకు అవకాశం ఉంటుంది.