Andhra Pradesh: తెగదెంఫులా? వేచి చూసే ధోరణా?: నేడు తేల్చనున్న చంద్రబాబు

  • బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం
  • ప్రజలు ఆగ్రహంతో ఉన్నారంటున్న టీడీపీ నేతలు
  • ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని బాబుపై ఒత్తిడి
  • నేడు కీలక సమావేశం

గత వారంలో పార్లమెంట్ ముందుకు వచ్చిన 2018-19 బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ, పొత్తుపై కీలక నిర్ణయం తీసుకోనుంది. నేడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలా? లేక మరికొంత కాలం వేచి చూసే ధోరణిలో ఉండాలా? అన్న విషయమై తేల్చనున్నారు. ప్రత్యేక హోదా స్థానంలో ఇస్తామన్న ప్యాకేజీ అసంతృప్తికరంగా ఉండటం, రైల్వే జోన్ ఊసు బడ్జెట్ లో లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, అసహనం వున్నాయని, వాటిని తగ్గించలేకుంటే, అది ప్రభుత్వంపై వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని ఇప్పటికే పలువురు మంత్రులు చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే తదుపరి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం క్లిష్టతరమవుతుందని, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు టీడీపీ వెంటే ఉంటారని కూడా వారు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం సైతం ముదిరి పాకాన పడింది. తాము సమన్వయం పాటిస్తుంటే, బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, అదే విధమైన ఆరోపణలు బీజేపీ నుంచి కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే టీడీపీ నేతల సమావేశం కీలకమైంది.

  • Loading...

More Telugu News