air india: ఎయిరిండియా ప్రైవేటు పరం... జూన్ లోగా వేలం వేస్తాం!: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా

  • ఎయిరిండియాను వదిలించుకునేందుకు రంగం సిద్దం
  • జూన్ నాటికి పెట్టుబడులు ఉపసంహరించుకుని, బిడ్డింగ్ ప్రక్రియ
  • డిసెంబర్ నాటికి ఎయిరిండియాకు చట్టబద్ధమైన ముగింపు 

నష్టాలలో కూరుకుపోయిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాను వదిలించుకునేందుకు కేంద్రం ముందుకు సాగుతోంది. దీనిని ప్రైవేటుపరం చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ, నష్టాల్లో నడుస్తున్న ఎయిరిండియాకు తిరిగి మహర్దశ తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ మేరకు ఎయిరిండియాను ప్రైవేటుపరం చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలిపారు.
 
ఎయిరిండియాలో పెట్టుబడులు ఉపసంహరించుకుని, జూన్ నాటికి బిడ్డింగ్ నిర్వహించి, డిసెంబర్ నాటికల్లా చట్టబద్ధమైన ముగింపు పలకాలని నిర్ణయించామని జయంత్ సిన్హా తెలిపారు. కాగా, ఎయిర్ ఇండియాను నష్టాల బారినుంచి గట్టెక్కించేందుకు 2012లో తీసుకొచ్చిన టర్న్ అరౌండ్ విధానానికి ఇప్పటివరకు 30,231 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ఆయన తెలిపారు.

More Telugu News