: బొత్స ఢిల్లీ పర్యటన మర్మం?


కాంగ్రెస్ అసమ్మతి రాజకీయాలు గుంభనంగా సాగుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ ఈ ఉదయం ఢిల్లీకి వెళుతున్నారు. సాధారణంగా నేతల ఢిల్లీ పర్యటనలకు పెద్ద ప్రాధాన్యం ఏమీ ఉండదు. అయితే నిన్న కేంద్ర మంత్రి చిరంజీవి ఇంట్లో బొత్స, ఆనం, రఘువీరా సమావేశమై సమాలోచనలు జరిపిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే బొత్స ఢిల్లీకి వెళుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. చాలా మంది నేతలు ముఖ్యమంత్రిపై గుర్రుగా ఉన్నారు. తమకు ప్రాధాన్యం ఏమీ ఇవ్వడం లేదని, ఒంటెత్తు పోకడలు పోతున్నారని కారాలు మిరియాలు నూరుతున్నారు. కొందరు అదిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News