Andhra Pradesh: టీడీపీలో చేరిన చిత్తూరు వైసీపీ నేత సుబ్రహ్మణ్యంరెడ్డి.. పలువురు ప్రజా ప్రతినిధులకు కూడా టీడీపీ తీర్థం!

  • సోమవారం రాత్రి అనుచరులతో కలిసి టీడీపీలో చేరిన జడ్పీ మాజీ చైర్మన్
  • కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు
  • విభజన సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నామన్న సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో చిత్తూరు జడ్పీ మాజీ చైర్మన్, వైసీపీ నేత ఎం.సుబ్రహ్మణ్యంరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుబ్రహ్మణ్యం రెడ్డితోపాటు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి ఆయన మద్దతుదారులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

సుబ్రహ్మణ్యం రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. విభజన తర్వాత రాష్ట్రం అనేక సమస్యల్లో చిక్కుకున్నట్టు చెప్పారు. వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News