Telugudesam: నేను టీడీపీలో చేరడం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇష్టం లేదు: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
- నా అనుచరుడు రఘునాథరెడ్డిపై జరిగిన దాడిని నాపైకి నెడుతున్నారు
- నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ దాడి చేయించానని కేసు పెట్టారు
- పాణ్యంకు చెందిన బావమరుదులు చేస్తున్న కుట్ర ఇది: బైరెడ్డి
తాను టీడీపీలో చేరడం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇష్టం లేదని తెలుగుదేశం పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన అనుచరుడు రఘునాథరెడ్డిపై జరిగిన దాడిని తనపైకి నెడుతున్నారని అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ దాడి చేయించానని కేసు పెట్టడం ఎంత వరకు సబబు? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని అన్నారు. పాణ్యం నియోజకవర్గానికి చెందిన బావమరుదులు చేస్తున్న కుట్ర ఇదని ఆయన ఆరోపించారు.