: ఐపిఎల్ లో సచిన్ ఫోర్ల రికార్డు


రికార్డుల క్రికెట్ వీరుడు సచిన్ టెండుల్కర్ మరో రికార్డును నమోదు చేశాడు. నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ విజయంలో సచిన్ పాత్రే కీలకం. అందుకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సచిన్ కు దక్కింది. ఈ మ్యాచ్ లో సచిన్ 28బాల్స్ లో 48 పరుగులు పిండుకున్నాడు. ఇందులో 32 పరుగులు ఫోర్ల ద్వారా రాబట్టినవే. 8 ఫోర్లు బాది ఐపిఎల్ లోనే అత్యధిక ఫోర్లను(289) కొట్టిన క్రికెటర్ గా సచిన్ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో సచిన్ స్ట్రయిక్ రేటు 171తో ఐపిఎల్ లోనే రెండో అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఐపిఎల్ లో సచిన్ అందుకున్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు 8కి చేరాయి.

  • Loading...

More Telugu News