: 3డీలో గుండె కణజాలం తయారీ
కేవలం సినిమాలే కాదు.. శరీర అవయవాలను కూడా శాస్త్రవేత్తలు 3డిలో తయారుచేసేస్తున్నారు. శరీరం లోపల ఉండే భాగాలను కూడా రూపొందించేస్తున్నారు. తాజాగా డ్యూక్ యూనివర్సిటీకి చెందిన జీవవైద్య ఇంజినీర్లు 3డిలో గుండె కణజాలాన్ని నిర్మించారు. ఇది మామూలు కణజాలంలాగానే పనిచేస్తుందిట. గుండెపోటు బాధితుల చికిత్సలోను, గుండె సమస్యలకు సంబంధించి మందుల తయారీ లోనూ ఈ 3డి కణజాలం ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
వీరు రూపొందించిన 3డి గుండె కణజాలం.. మామూలు గుండె ఎలా పనిచేస్తుందో అలాగే చేస్తోందిట. స్టెంసెల్స్ ఆధారంగా వీరు దీనిని ఆరువారాల్లో తయారుచేశారు. భవిష్యత్తులో మరింత తక్కువ సమయంలోనే దీన్ని తయారుచేయవచ్చునని వారు అంటున్నారు.