: వయస్సులో వ్యత్యాసంతో దంపతుల మధ్య ఎడం
మామూలుగా మన సమాజంలో స్త్రీపురుషుల మధ్య వివాహానికి పురుషుడు మూడేళ్ళు పెద్దగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. పెళ్లికి అనుకూలమైన మేజర్ అయ్యే వయసును అధికారికంగా ప్రభుత్వాలు నిర్ధారించడం కూడా.. పురుషులకు 21, స్త్రీలకు 18 అంటూ మూడేళ్ల ఎడంతోనే నిర్ణయించింది. అయితే దంపతుల మధ్య వయసులో తేడా ఎక్కువగా ఉంటే.. అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇద్దరూ ఒకే వయసు వారైతే.. ఎంతో బాగుంటుందని కూడా ఈ అధ్యయనాలు సెలవిస్తున్నాయి. తేడా ఎక్కువైతే గనుక, ఆర్థికంగా మేధోపరంగా ఆరోగ్యపరంగా వెనుకబడి ఉంటారట. అమెరికా కొలరాడోలోని డెన్వర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక సర్వే నిర్వహించారు.
విద్య, వృత్తి, వేతనం, పెళ్లినాటికి వయస్సు వంటి వాటిని వీరు పరిశీలించారు. 1979లో జరిగిన ఆరోగ్య మేధోపరమైన సర్వే ఫలితాలను కూడా అబ్జర్వ్ చేశారు. ఒకే వయసులో ఉన్న దంపతుల మధ్య జీవన సరళి సఖ్యత సారూప్యత బాగా ఉన్నట్లు వీరు గుర్తించారు. ఆరోగ్యం ఆకర్షణ పరంగా కూడా సమవయస్కులైన దంపతులే ఎక్కువ సఖ్యంగా ఉంటున్నారట. పైగా ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు జీవిత భాగస్వాములుగా సమవయస్కులనే ఎంచుకుంటున్నారని, చిన్న ఉద్యోగాలు, వృత్తులలో ఉన్న వారు మాత్రం... తమ కన్నా చిన్నవారినో, పెద్దవారినో చేసుకుంటున్నారని కూడా వీరు గుర్తించారు.