YSRCP: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం: వైసీపీ నేత ఆదిశేషగిరిరావు ధీమా

  • మా ఫీడ్ బ్యాక్ మాకుంది
  • టీడీపీ, ఆ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన విధంగా లేదు
  • 2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం: ఆదిశేషగిరిరావు

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో తమ పార్టీ గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయని వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు జోస్యం చెప్పారు. ‘ఐడ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఇవి వైసీపీ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ (పీకే) చెప్పిన లెక్కలు కాదు. మాకు ఉన్న లెక్కలు. మా ఫీడ్ బ్యాక్ మాకుంది. 2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం. టీడీపీ, ఆ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన విధంగా లేదు. ఇవన్నీ మా పార్టీకి ‘ప్లస్’ అవుతాయి. జగన్ చేపట్టిన పాదయాత్ర వల్ల మా ఓటు బ్యాంకు మాకు వచ్చేస్తుంది. తటస్థంగా ఉన్న వారిని మాకు అనుగుణంగా మలచుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెజార్టీ లభిస్తే అధికారం వస్తుంది. ఈ నాలుగు జిల్లాల్లో మెజార్టీ సాధించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News