acb asp: మహిళా ఏఎస్పీ, సీఐ మధ్య బంధం బలపడింది ఓటుకు నోటు కేసు దర్యాప్తులోనే!

  • ఏసీబీలో సీఐగా పనిచేసిన మల్లికార్జున్ రెడ్డి
  • ఓటుకు నోటు కేసు దర్యాప్తులో భాగమైన సునీతరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి
  • వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడంతో పెరిగిన సాన్నిహిత్యం
  • మల్లికార్జున్ రెడ్డి వివరణ పేరుతో వాట్స్ యాప్ సందేశం చక్కర్లు

ఏసీబీలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఏఎస్పీతో కల్వకుర్తి సీఐకి మధ్య బంధం బలపడేందుకు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు కారణమైనట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతల్లో ఉండగా సునీతారెడ్డి, మల్లికార్జున్‌ రెడ్డిలు వ్యక్తిగత విషయాలను మాట్లాడుకునే వారు. ఈ సమయంలోనే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి తన భర్తతో కలిసి ఉండలేనని సునీత, తను భార్యతో సఖ్యంగా లేనని మల్లికార్జున్ రెడ్డిలు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు.

ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇన్‌ స్పెక్టర్‌ గా ఉన్న మల్లికార్జున్‌ రెడ్డిని ఏసీబీ నుంచి బదిలీ చేశారు. అయినప్పటికీ వారి మధ్య సాన్నిహిత్యం మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. వివాదం రేగిన అనంతరం మల్లికార్జున్‌ రెడ్డి వివరణ పేరుతో వాట్స్ యాప్‌ లో ఒక సందేశం చక్కర్లు కొడుతోంది.

తమది వివాహేతర సంబంధం కాదని, సునీతతో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని, ఆమె విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారని, ఆమెకు విడాకులు మంజూరయిన వెంటనే వివాహం చేసుకోవాలనుకున్నామని, ఈ విషయం సునీతారెడ్డి భర్తకు కూడా చెప్పానని, ఆదివారం రాత్రి సునీతరెడ్డిని ఇంటి వద్ద డ్రాప్‌ చేసేందుకు వెళ్లానని మల్లికార్జున్‌ రెడ్డి అన్నట్లు వాట్సప్‌ సందేశంలో ఉంది. దీనిపై త్వరలోనే మీడియా ముందుకు ఇద్దరం వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తామని మల్లికార్జున్‌ అన్నట్లు అందులో ఉందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. 

More Telugu News