Jagan: అలా చేస్తే, బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా: వైఎస్ జగన్

  • ప్రత్యేక హోదా ఇస్తే మరో ఆలోచన లేకుండా బీజేపీతో కలుస్తా
  • చంద్రబాబు ఎన్నో అసత్యాలు చెబుతున్నారు
  • రాజధాని పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారు

ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న పాదయాత్ర 900 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే ఎన్నికల్లో మరో ఆలోచన లేకుండా బీజేపీతో కలిసి పని చేసేందుకు సిద్ధమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు అమరావతి రాజధాని నిర్మాణ పనులు మొదలు కాలేదని అన్నారు. 

  • Loading...

More Telugu News