Chandrababu: ‘కేంద్రం’తో గొడవలు పెట్టుకుంటే పనులు జరగవు: అవంతి వ్యాఖ్యలపై చంద్రబాబు
- విభజన సమస్యల పరిష్కారంలో రాజీపడే ప్రసక్తే లేదు
- సహనంతో నిధులు సాధించే ప్రయత్నం జరుగుతోంది
- ‘కేంద్రం’తో ప్రతిపక్షాలు రాజీపడుతున్నాయి: బాబు విమర్శ
విభజన చట్టం హామీల అమలు విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వ్యక్తం చేసిన అభిప్రాయంపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుంటే పనులు జరగవని, అయితే, విభజన సమస్యల పరిష్కారంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పడకుండా సహనంతో నిధులు సాధించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. తమ అవసరాల కోసం ‘కేంద్రం’తో ప్రతిపక్షాలు రాజీపడుతున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు విమర్శించారు.