YSRCP: జగన్ పాదయాత్ర.. సభలో కూలిన స్టేజ్!
- శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంఘటన
- కుప్పకూలిన స్టేజ్..పలువురికి గాయాలు
- ఆ సమయంలో వ్యాన్ పై నుంచి ప్రసంగిస్తున్న జగన్
వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వ్యాన్ పై నుంచి జగన్ మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ సంఘటనలో వైసీపీ నాయకులు ఇద్దరికి, పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే, సమీప ఆసుపత్రికి వీరిని తరలించి వైద్య చికిత్స అందించారు. కాగా, జగన్ వస్తున్న సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు స్టేజ్ పైకి ఎక్కడంతో ఈ సంఘటన జరిగింది. చెర్లోపల్లి వద్ద జగన్ పాదయాత్ర 900 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా రావి మొక్కను జగన్ నాటారు.