Andhra Pradesh: ఏపీ బీజేపీ నాయకుల వితండవాదం తగదు: కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ

  • విభజన చట్టం హామీల అమలు విషయంలో మోదీ సర్కారు వివక్ష
  • రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఏపీ బీజేపీ ప్రశ్నించదే?
  • ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై విమర్శలు గుప్పించిన కొలనుకొండ  

ఏపీకి చెందిన బీజేపీ నాయకులపై ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టం హామీల అమలు విషయంలో ఏపీపై మోదీ సర్కారు వివక్ష చూపుతున్నప్పటికీ అంతా సవ్యంగా ఉందంటూ ఏపీ బీజేపీ నాయకులు వితండవాదన చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి నాయకులు పదేపదే చంద్రబాబు సర్కారును విమర్శించడం తప్పా, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని మోదీ ఎదుట నోరు మెదపటం లేదని విమర్శించారు.

సోము వీర్రాజు తీరు చూస్తుంటే.. ఏపీ బీజేపీ శాఖకు అధ్యక్షుడు అయ్యేందుకు, తమ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు మీడియా ఎదుట అవాకులు చెవాకులు పేలుతున్నట్టుందని,  రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవడంపై ఆయన చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాని, విభజన చట్టం హామీలను నెరవేర్చేందుకు ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయానికి బీజేపీ, టీడీపీ రెండూ కారణమేనని, విభజన చట్టంలో హామీలను అమలు చేయకుండా ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడదని అన్నారు.

  • Loading...

More Telugu News