Andhra Pradesh: ఏపీ, తెలంగాణ ఆదాయంపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వ్యాఖ్యలు తప్పు: చలసాని శ్రీనివాస్
- ఏపీ తలసరి ఆదాయాన్ని బట్టి ‘హోదా’ ఇవ్వలేమంటే కుదరదు
- హిమాచల్, ఉత్తరాఖండ్ తలసరి ఆదాయం ఏపీ కంటే ఎక్కువ
- ఆ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఎలా ఇచ్చారు?: చలసాని
ఏపీ, తెలంగాణ ఆదాయంపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను విభజన హామీల సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ తప్పుబట్టారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తలసరి ఆదాయం ఏపీ కంటే ఎక్కువని, ఏపీ తలసరి ఆదాయాన్ని బట్టి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటే కుదరదని, ఆ రెండు రాష్ట్రాలకు ఆ హోదా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
కాగా, రాష్ట్ర విభజన హామీల సాధనకు వచ్చే నెలలో ఉమ్మడి పోరుకు శ్రీకారం చుట్టనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తోందని, ప్రధాని మోదీతో ఇటీవల భేటీ అయిన సీఎం చంద్రబాబు ఏ విధమైన హామీలు పొందారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై టీడీపీ పోరాడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని మధు ప్రకటించారు.