: సచిన్ ఫామ్ లో కొచ్చాడు!


క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఫామ్ లో కొచ్చాడు. చాన్నాళ్ళ తర్వాత తనదైన శైలిలో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలో దిగిన సచిన్ కేవలం 28 బంతుల్లోనే 48 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించాడు. సచిన్ స్కోరులో 8 బౌండరీలున్నాయి. కాగా, మరో ఓపెనర్ డ్వేన్ స్మిత్ 47 పరుగులు చేసి తన ఫామ్ చాటుకున్నాడు. చివర్లో దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సులు) బ్యాట్ ఝుళిపించడంతో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగుల భారీ స్కోరు సాధించింది.

  • Loading...

More Telugu News