: కర్ణాటకలో లక్షకు పది లక్షలు..!


రూ. లక్షకు రూ. 10 లక్షలు.. ఇదీ కర్ణాటకలో ఎన్నికల ఫలితాలపై పందెం రాయుళ్ళ తీరు. ఓ వ్యక్తి యడ్యూరప్ప పార్టీ కేజేపీ అభ్యర్థి సిద్ధలింగస్వామి గెలుస్తాడని లక్షన్నర పందెం కాయగా.. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య గెలుస్తాడని మరో వ్యక్తి స్కొడా కారుతో పాటు రూ. 10 లక్షలు పందెం కాయడం విశేషం.

ఇక బంగారు ఉంగరాలు, సెల్ ఫోన్లు, కాస్ట్ లీ వాచ్ లు, దుస్తులు.. ఇలా ఒకటేమిటి, ఖరీదైన వస్తువు అనిపించిందల్లా పందెంలో ఒడ్డుతున్నారు. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా పందాల జ్వరం ఇప్పుడు కర్ణాటకను కుదిపేస్తోంది. పందెంలో గెలిచిన వారికి ఒకటికి ఐదురెట్లు సొమ్ము తిరిగి చెల్లిస్తామంటూ కొందరు వల విసురుతున్నారు. వీళ్ళ అదృష్టం ఎలా ఉందో రేపటి ఫలితాలతో తేలనుంది.

  • Loading...

More Telugu News