sahara: అద్భుతం.. మంచుతో నిండిపోయిన సహారా ఎడారి.. వీడియో చూడండి!

  • సహారాపై మంచు దుప్పటి
  • కొన్ని చోట్ల 16 అంగుళాల మేర మంచు
  • ధ్రువ ప్రాంతాలను తలపిస్తున్న సహారా

ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి, అత్యంత వేడి కలిగిన సహారా ఎడారి స్వరూపమే మారిపోయింది. ఉత్తర అమెరికా, కెనడాలను ముంచెత్తిన హిమపాతం చివకు సహారాను కూడా వదల్లేదు. సహారాను మంచు దుప్పటి కప్పేసింది. ఎర్రటి ఇసుక తిన్నెలన్నీ మంచుతో కప్పబడి, ధ్రువ ప్రాంతాలను తలపిస్తున్నాయి. గత 37 సంవత్సరాల్లో ఇలా జరగడం ఇది నాలుగోసారి. సహారాకు గేట్ వేగా పిలువబడే ఆల్జీరియాలోని ఐన్ సెఫ్రా పట్టణానికి సమీపంలో ఉన్న ఎడారిలో మంచు కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 16 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. వాతావరణంలో నెలకొన్న అసమానతల వల్లే మంచు కురిసిందని అధికారులు చెబుతున్నారు.

More Telugu News