rajanikanth: పొలిటికల్ డ్రామా నేపథ్యంలో మరో మూవీ చేయనున్న రజనీ?

- ముగింపు దశకి చేరుకున్న 'కాలా'
- రజనీకి మరో లైన్ వినిపించిన రంజిత్
- పూర్తి కథపై కసరత్తు
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ చేసిన '2.0' సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది. ఇక పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తోన్న 'కాలా' సినిమా కూడా షూటింగ్ పరంగా చివరిదశకి చేరుకుంది. రజనీకాంత్ రాజకీయాలకి పూర్తి సమయం కేటాయించవచ్చనీ, అందువలన 'కాలా' తరువాత ఆయన సినిమాలు చేయకపోవచ్చనే టాక్ వినిపించింది.
అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం. 'కాలా' తరువాత పా రంజిత్ దర్శకత్వంలోనే రజనీకాంత్ మరో సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగే ఒక లైన్ ను రజనీకాంత్ కి రీసెంట్ గా రంజిత్ వినిపించాడట. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెడుతూ ఆ నేపథ్యం కలిగిన ఒక సినిమా చేస్తే మంచిదనే ఉద్దేశంతోనే రజనీకాంత్ ఈ సినిమాను అంగీకరించారని అంటున్నారు. ఇక పూర్తి కథ వినిపించి రజనీకాంత్ ను రంజిత్ ఒప్పించడమే తరువాయి.