Pawan Kalyan: పూనమ్ కౌర్ తన ట్వీట్లను ఎందుకు తొలగించాల్సి వచ్చింది? : కత్తి మహేశ్

  • పూనమ్ ట్వీట్లను తొలగించేందుకు కారణమైన పరిస్థితులు ఏంటి?
  • పవన్ సాయం కోరిన పూనమ్ కు నేనూ మద్దతిస్తున్నా
  • కత్తి మహేశ్ ట్వీట్లు

ప్రముఖ నటి పూనమ్ కౌర్ పై ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించాలని, తనను ఈ పరిస్థితి నుంచి బయటపడేయాలని పూనమ్ కౌర్ తన వరుస ట్వీట్లలో విజ్ఞప్తి చేసింది. అయితే, ఆ ట్వీట్స్ చేసిన కొంచెం సేపటికే వాటిని తన ఖాతా నుంచి ఆమె తొలగించింది.

 ఈ విషయమై కత్తి మహేశ్ స్పందిస్తూ, పూనమ్ కౌర్ తన ట్వీట్లను తొలగించేందుకు కారణమైన పరిస్థితులు ఏంటి? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం నుంచి తనను పవన్ కల్యాణ్ బయటపడేయాలని పూనమ్ కౌర్ కోరడాన్ని తాను స్వాగతిస్తున్నానని, ఈ వ్యాఖ్యలకు తన మద్దతు తెలుపుతున్నానని కత్తి మహేశ్ మరో ట్వీట్ లో పేర్కొనడం గమనార్హం.  

More Telugu News