kcr: పంచాయతీ రాజ్ బిల్లు తయారీ కోసం తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు!

- ఏడుగురు సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
- సబ్ కమిటీ చైర్మన్ గా జూపల్లి కృష్ణారావు
- సభ్యులుగా మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేటీఆర్..తదితరులు
తెలంగాణ పంచాయతీ రాజ్ బిల్లు తయారీ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని సీఎం కేసీఆర్ ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సబ్ కమిటీకి పంచాయతీ రాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇంకా ఈ కమిటీలో మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు ఉన్నారు.
కాగా, రాష్ట్రంలో జరగనున్న కో-ఆపరేటివ్ ఎన్నికలపై ఈ కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేయనుంది. గతంలో పంచాయతీరాజ్ శాఖా మంత్రులుగా పని చేసిన ఇద్దరు మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేటీఆర్ ఈ సబ్ కమిటీలో ఉండటం గమనార్హం.