YSRCP: ‘జన్మభూమి’ కమిటీల పేరిట రాష్ట్రమంతటా మాఫియా ముఠాలు: వైఎస్ జగన్ ఆరోపణ

  • చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాసంకల్ప యాత్ర
  • సొంత నియోజకవర్గం కుప్పంను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు  
  • చంద్రబాబు చదువుకున్న స్కూల్ శిథిలావస్థలో ఉంది: జగన్

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్రలో 55వ రోజులో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని దామలచెరువుకు చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేసిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్ర మంతటా మాఫియా ముఠాలను ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దోచుకుంటోన్న సీఎం చంద్రబాబునాయుడు, జన్మభూమి అభివృద్ధిని మాత్రం గాలికొదిలేశారని ఆరోపించారు.

తన సొంత నియోజకవర్గం కుప్పంను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. చివరకు, తన సొంత ఊరు నారావారిపల్లె, ఆయన చదువుకున్న స్కూల్ శేషాపురం చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉన్నాయని అన్నారు. చంద్రబాబు గారు చదువుకున్న స్కూల్ ప్రస్తుతం శిథిలావస్థలో ఉందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చంద్రగిరిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం వైఎస్సార్ ఇచ్చిన జీవోను చంద్రబాబు పక్కన పెట్టేశారని విమర్శించారు.

  • Loading...

More Telugu News