haryana: హర్యానా దేశానికే ఆదర్శం... అధిక రిస్క్ గర్భిణుల కోసం ఓ ప్రత్యేక వెబ్ సైట్

  • వెబ్ సైట్ లో రిస్క్ ను గుర్తించే సమాచారం
  • ఎప్పుడు ఆస్పత్రికి వెళ్లాలో సమాచారం
  • గర్భిణుల కోసం పోర్టల్ తీసుకొస్తున్న తొలిరాష్ట్రం

హర్యానా సర్కారు దేశంలో తొలిసారిగా అధిక రిస్క్ తో కూడిన గర్భిణుల కోసం ప్ర్యతేకంగా ఓ వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. గర్భిణి స్త్రీల్లో అధిక రిస్క్ ఉందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు తగిన సమాచారం ఈ వెబ్ పోర్టల్ లో ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆస్పత్రికి వెళ్లాలి? అన్న సమాచారంతో పాటు నిపుణుల ఆధ్వర్యంలో డెలివరీకి గాను సూచనలు కూడా ఈ పోర్టల్ ద్వారా అందుతాయి.

సర్కారు తీసుకున్న ఈ చర్యను నీతి ఆయోగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మెచ్చుకున్నట్టు హర్యానా రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఈ రాష్ట్రంలో అధిక రిస్క్ ప్రెగ్నెన్సీ విధానం గతేడాది నవంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ఆధారంగా రిస్క్ ఉన్న గర్భిణులను నూరు శాతం గుర్తించేందుకు వీలవుతుంది. ప్రసూతి మరణాలు, శిశు మరణాల రేటును తగ్గించేందుకు ఉపయోగపడుతుందని మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు.

More Telugu News