: పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కు తీవ్ర గాయాలు


పాకిస్తాన్ క్రికెట్ మాజీ సారథి ఇమ్రాన్ ఖాన్ నేడు తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ ఓ సభా వేదికపైకి ఎక్కే క్రమంలో మెట్లు కూలిపోవడంతో ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆయన అంగరక్షకులకు కూడా గాయాలయ్యాయి. అందుబాటులో అంబులెన్స్ లేకపోవడంతో కార్యకర్తలకు చెందిన వాహనంలో ఇమ్రాన్ ను షౌకత్ ఖానుమ్ ఆసుపత్రికి తరలించారు. ఆయన తల నుంచి తీవ్ర రక్తస్రావం జరిగిందని ఓ కార్యకర్త తెలిపాడు.

ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పేరిట పార్టీ స్థాపించి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ నెల 11న పాక్ లో ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ తన పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News