Telugudesam: టీడీపీ నేత ప్రతిభా భారతి మనవడు మృతి!

  • ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మా ప్రసాద్ కుమారుడు విక్కీ మృతి
  • అన్నం తింటుండగా ఉక్కిరిబిక్కిరవడంతో సంఘటన
  • ప్రతిభా భారతి స్వగ్రామం కావలిలో చిన్నారి ఖననం

టీడీపీ నేత, పొలిట్ బ్యూరో సభ్యురాలు ప్రతిభా భారతి ఇంట విషాదం నెలకొంది. ప్రతిభా భారతి మనవడు (కుమార్తె గ్రీష్మా ప్రసాద్ కొడుకు) మృతి చెందాడు. రాజాం పట్టణ టీడీపీ అధ్యక్షురాలు, సామాజిక ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ చైర్ పర్సన్ గ్రీష్మా ప్రసాద్ కుమారుడు గొలగాని విఖ్యాత్ (4) అలియాస్ విక్కీ నిన్న మృతి చెందాడు. విశాఖపట్టణంలోని తన మేనత్త శ్వేతారెడ్డి ఇంట్లో ఉంటూ, ఓక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో నర్సరీ చదువుతున్నాడు.

నిన్న భోజనం చేస్తుండగా ఊపిరాడక, ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే స్పందించిన మేనత్త, విక్కీని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే విక్కీ మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. కాగా, జనవరి 1వ తేదీన రాజాం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో తన అమ్మమ్మ, అమ్మతో విక్కీ పాల్గొన్నాడు. ఆ మర్నాడు  స్కూల్ కు కూడా వెళ్లాడు. మంగళవారం రాత్రి తన అమ్మమ్మ ప్రతిభా భారతితో ఫోన్ లో మాట్లాడాడు. విక్కీ మృతిని అతని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, విక్కీ మృతదేహాన్ని ప్రతిభా భారతి స్వగ్రామం కావలికి నిన్నరాత్రి తరలించారు. అక్కడి స్మృతి వనంలో ఖననం చేశారు.

  • Loading...

More Telugu News