: వదల 'అంజలి' వదల!
దక్షిణాది హీరోయిన్ అంజలిని కోర్టు కష్టాలు వీడనంటున్నాయి. ఇంతకుముందు పిన్ని భారతీదేవి, తమిళ దర్శకుడు కళంజియం తనను వేధిస్తున్నారంటూ ఆరోపించిన అంజలి అనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆమె అజ్ఞాతం వీడి బయటికొచ్చినా కోర్టులు చుట్టూ తిరగకతప్పడం లేదు. ఇప్పటికే ఆమె పిన్ని భారతీదేవి అంజలిపై మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా దర్శకుడు కళంజియం పరువునష్టం దావా వేశారు. అంజలి తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణను సేలం మేజిస్ట్రేట్ కోర్టు ఈనెల 13కి వాయిదా వేసింది.