YSRCP: జగన్ ఆస్తుల కేసులో మరో అటాచ్ చేసిన ఈడీ!

  • రూ.117.74 కోట్ల ప్రాపర్టీస్ అటాచ్
  • వాటిలో శ్యాంప్రసాద్ రెడ్డి, ఇందూ ప్రాజెక్టు, వసంత డెవలపర్స్ ఎంబీసీ ప్రాపర్టీ డెవలప్ మెంట్ సంస్థల ఆస్తులు
  • ఈడీ అధికారుల వెల్లడి

వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో అటాచ్ చేసింది. రూ.117.74 కోట్ల ప్రాపర్టీస్ ను అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. గృహ నిర్మాణ ప్రాజెక్టుల చార్జ్ షీట్ కు సంబంధించి ఈ ఆస్తులు అటాచ్ అయ్యాయి. శ్యాంప్రసాద్ రెడ్డి, ఇందూ ప్రాజెక్టు, వసంత డెవలపర్స్, ఎంబీసీ ప్రాపర్టీ డెవలప్ మెంట్ సంస్థల ఆస్తులు ఈ అటాచ్ మెంట్ లో ఉన్నాయి.

 కాగా, శ్యాంప్రసాద్ రెడ్డి, ఇందూ ప్రాజెక్టు, వసంత డెవలపర్స్ ఎంబీసీ ప్రాపర్టీ డెవలప్ మెంట్ సంస్థలు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో క్విడ్ ప్రోకో ద్వారా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి, దానికి ప్రతిఫలంగా భూములు, ఇతర ప్రయోజనాలు పొందాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కూడా జరిగినట్టు తేలడంతో కేసులు నమోదు చేయగా, తాజాగా, ఆయా సంస్థల ఆస్తులను జప్తు చేసింది.

  • Loading...

More Telugu News