: ప్లే ఆఫ్ దిశగా 'రాయల్స్' పరుగు


రాహుల్ ద్రావిడ్ స్ఫూర్తిదాయక నాయకత్వంలో దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ దిశగా మరో అడుగు ముందుకేసింది. నేటి సాయంత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ద్రావిడ్ బృందం పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత ఢిల్లీ జట్టు 4 వికెట్లకు 154 పరుగులు చేసింది. బెన్ రోహ్రర్ 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. లక్ష్యఛేదనలో రాజస్థాన్ ఎక్కడా తడబడకుండా విజయం దిశగా సాగింది. ద్రావిడ్ 53 పరుగులు చేయగా, రహానే (63 నాటౌట్), వాట్సన్ (28) మిగతా పని పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News