Telangana: సంక్రాంతి తర్వాత ‘కాంగ్రెస్’లో భారీగా చేరికలు: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
- అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు నాతో టచ్ లో ఉన్నారు
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 70కి పైగా స్థానాల్లో గెలుస్తాం
- వరంగల్ లో త్వరలో దళిత, గిరిజన, బీసీల ఆత్మగౌరవ సభ
- ఈ సభకు రాహుల్ ని ఆహ్వానిస్తున్నాం: ఉత్తమ్
సంక్రాంతి పండగ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరగనున్నట్టు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తనతో టచ్ లో ఉన్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 70కి పైగా స్థానాల్లో తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని ఉత్తమ్ చెప్పారు. త్వరలో వరంగల్ లో దళిత, గిరిజన, బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నట్టు తెలిపారు.