gajal srinivas: గజల్ శ్రీనివాస్ తనను భయపెట్టిన విషయాన్ని వివరించి చెప్పిన బాధితురాలు
- గజల్ శ్రీనివాస్ గురించి నేను ఎవరికి చెప్పినా నమ్మరు
- అందుకే సాక్ష్యాలన్నీ సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశా
- వివాహేతర సంబంధం పెట్టుకోమని వేధించాడు
- బయట ఏ అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించేవాడు
గాయకుడు, రచయిత గజల్ శ్రీనివాస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. బాధిత యువతి మీడియాతో మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్ వికృత చేష్టల గురించి వివరించి చెప్పారు. గజల్ శ్రీనివాస్ గురించి తాను ఎవరికి చెప్పినా నమ్మరని, అందుకే సాక్ష్యాలన్నీ సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. తనకు బయట ఏ అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించేవాడని అన్నారు. గజల్ శ్రీనివాస్ తనతో వివాహేతర సంబంధం పెట్టుకోమని వేధించాడని తెలిపారు. పనిమనిషి పార్వతి కూడా తనను ఇబ్బంది పెట్టిందని, గజల్‌తో సన్నిహితంగా ఉండాలని డిమాండ్ చేసేదని చెప్పారు.
తాను ఉద్యోగం మానేసి బయటకు వెళ్లిపోతే, తన స్థానంలో వచ్చే మరో యువతి కూడా తనలాగే వేధింపులు ఎదుర్కుంటుందని, తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని తాను సాక్ష్యాలను కూడా బయటపెట్టానని బాధిత యువతి తెలిపారు. 'అమ్మాయిలందరూ పనికి వెళ్లినప్పుడు వారి పని వారు చేసుకోవాలి. ఎంత మంది మృగాళ్లు ప్రలోభపెట్టినా లొంగిపోవద్దు. మన తల్లిదండ్రులు మన మీద ఉన్న నమ్మకంతో ఉద్యోగానికి పంపుతున్నారు. మనం తప్పు చేయకపోతే, న్యాయమనేది మన వైపే ఉంటుంది. నేను డబ్బులు డిమాండ్ చేస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారు. నాకు డబ్బుపై ఎలాంటి ఆశా లేదు' అని ఆమె వ్యాఖ్యానించారు.