hyper aadi: 'జబర్దస్త్'లో అలా ఛాన్స్ వచ్చింది: హైపర్ ఆది

  • నేను చేసిన షార్ట్ ఫిల్మ్ 'అభి' చూశాడు 
  • చాలా బాగుందంటూ అభినందించాడు 
  • ఆర్టిస్ట్ గా అవకాశం ఇవ్వమని అడిగాను

'జబర్దస్త్' కార్యక్రమంతో హైపర్ ఆది క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయన పంచ్ లకు బుల్లితెర ప్రేక్షకులు పడి పడి నవ్వుతుంటారు. అలాంటి హైపర్ ఆది తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడాడు. " కాలేజ్ రోజుల నుంచే నేను స్టేజ్ పై ప్రదర్శనలకు ఉత్సాహాన్ని చూపుతుండేవాడిని. మొదటి నుంచి కూడా ఒక చోటనే కూర్చుని పనిచేయడం నాకు ఇష్టం ఉండేది కాదు .. నన్నేదో కట్టడి చేసినట్టుగా అనిపించేది. ఇక నాలో వున్న రైటర్ బయటికి వచ్చింది 'జబర్దస్త్' తోనే"

"ఒకసారి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసి ఫేస్ బుక్ లో పెడితే, 'అదిరే అభి' కామెంట్ పెట్టాడు .. 'సూపర్ బ్రదర్ ఒకసారి మీట్ అవ్వండి' అంటూ. ఆ స్క్రిప్ట్ నచ్చి రైటర్ గా యూజ్ అవుతాడని ఆయన పిలవడం జరిగింది. నాలో రైటర్ ఉన్నాడనే విషయం అప్పటికి సరిగ్గా నాకు తెలియక, ఆర్టిస్ట్ గా అవకాశాలు ఏవైనా వుంటే ఇవ్వమని అడిగాను. అలా అభితో ఏర్పడిన పరిచయం 'జబర్దస్త్' వరకూ తీసుకెళ్లింది" అంటూ చెప్పుకొచ్చాడు.  

  • Loading...

More Telugu News