: పట్టాభి అడిగితే మహేశ్ బాబు కాదంటాడా..!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటనలోనే కాదు వ్యక్తిత్వంలోనూ ఇతరులకు భిన్నంగానే వ్యవహరిస్తాడు. పరిమితంగా మాట్లాడతాడు, అంతే మోతాదులో బయట కనిపిస్తాడు. ఏవో వాణిజ్య ప్రచార కార్యక్రమాలు, తన సినిమా ఫంక్షన్లు, ఇల్లు, భార్యాపిల్లలు.. ఇదే లోకంగా మహేశ్ బాబు ఉంటారని సినీ వర్గాలు ఎప్పుడో ఓ నిశ్చితాభిప్రాయానికొచ్చేశాయి. అయితే, ఈ సొగసరి హీరో తాజాగా ఓ గృహ ప్రవేశానికి హాజరు కావడానికి ఒప్పుకున్నాడట, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ.
మరెవరి కార్యక్రమమో అయితే మహేశ్ అంగీకరించేవాడు కాడేమో గానీ, స్వయానా తన మేకప్ మేన్ పట్టాభి కొత్త ఇంట్లో ప్రవేశిస్తుంటే హాజరుకానని ఎలా అనగలడు? అందుకే, పట్టాభి అడిగిన వెంటనే ఓకే చెప్పేశాడు. దీంతో, పట్టాభి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడట.