: ముంబయిలో కాంగ్రెస్ యువనేత నగ్ననృత్యాలు


అతనో కాంగ్రెస్ యువనేత. పేరు సూరజ్ ఠాకూర్. ముంబయి ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు. పార్టీలోని విద్యార్థి విభాగానికి ఆదర్శంగా నిలవాల్సిన అతడే కట్టుతప్పాడు. బట్టలిప్పుకుని, నగ్నంగా, ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు చేసి చివరికి పార్టీ ఆగ్రహానికి గురయ్యాడు. ముంబయి శివారు ప్రాంతమైన కాండివాలిలో ఎన్ఎస్ యూఐ శిక్షణ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఠాకూర్ తో పాటు క్రమశిక్షణ ఉల్లంఘించిన మరో ఇద్దరిపైనా వేటు పడింది.

వీరు ముగ్గురూ చిత్తుగా తాగి, రాజకీయ పాఠాలు బోధించడానికి వచ్చిన శిక్షకులకు తమదైన శైలిలో పాఠాలు బోధించారట. దీంతో, వెంటనే స్పందించిన పార్టీ వర్గాలు ఈ తాగుబోతు త్రయంపై సస్పెన్షన్ వేటు వేశాయి. అంతేగాకుండా, సస్పెన్షన్ ప్రకటన సారాంశాన్ని ఎన్ఎస్ యూఐ ఫేస్ బుక్ పేజీలోనూ పెట్టారు.

  • Loading...

More Telugu News