: 'ఆకాశ్' ట్యాబ్లెట్ ఇప్పుడు రూ. 1500కే
బ్రాండెడ్ ట్యాబ్లెట్ పీసీల ధరలు చుక్కలనంటుతున్నతరుణంలో ఆకాశ్ ట్యాబ్లెట్ మరింత చవకగా లబించనుంది. కేవలం రూ. 1500 కే దీనిని అతి చౌకగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి కపిల్ సిబాల్ వెల్లడించారు. విద్యార్థులందరికీ 'ఆకాశ్' అందేలా చేయడమే తమ ఉద్దేశమని సిబాల్ పేర్కొన్నారు. ఈ మేరకు సీడాక్ డీజీ రజత్ మూనాకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మహిళలకు భద్రత కరవైన ప్రస్తుత తరుణంలో రక్షణకు ఉపకరించే సాంకేతిక పరికరాలను రూపొందించాలని సిబాల్ ఆదేశించారు.