Chandrababu: 2018ని ప్రకృతి వ్యవసాయ నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నను!: సీఎం చంద్రబాబు

  • గుంటూరులో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణా శిబిరం 
  • తక్కువ పెట్టుబడితో మంచి లాభాలకు ప్రకృతి వ్యవసాయం
  • చరిత్ర సృష్టించేందుకు ఏపీ రైతులు సిద్ధంగా ఉన్నారు: చంద్రబాబు

2018 సంవత్సరాన్ని ప్రకృతి వ్యవసాయ నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరులో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సాగు సాఫీగా సాగాలన్నా, తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు సాధించాలన్నా, ప్రకృతి వ్యవసాయమే పరిష్కారమని అన్నారు.  సేంద్రీయ వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేశారని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు. ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్న చంద్రబాబు, చరిత్ర సృష్టించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

  • Loading...

More Telugu News