Pm: ఎన్నో ఏళ్ల బాధ నుంచి ముస్లిం మహిళలకు విముక్తి: ప్రధాని మోదీ
- ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారంతో కష్టాలు పడ్డారు
- చివరికి ఓ పరిష్కారం దొరికిందంటూ ప్రధాని ప్రకటన
- అందరితో కలసి అందరి అభివృద్ధి అంటూ సందేశం
ట్రిపుల్ తలాక్ ను నిషేధించే బిల్లును లోక్ సభ ఆమోదించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై ఈ రోజు స్పందించారు. ‘‘ఎన్నో ఏళ్ల వేదన తర్వాత చివరికి ముస్లిం మహిళలు ఆ ఆచారం నుంచి బయటపడే పరిష్కార మార్గాన్ని గుర్తించారు’’ అని ప్రధాని పేర్కొన్నారు. ప్రబలమైన ఈ ఆచారం కారణంగా ముస్లిం మహిళలు కష్టాలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘అందరితో కలసి అందరి అభివృద్ధి’ అంటూ ప్రధాని నూతన సంవత్సర సందేశం ఇచ్చారు.