: ఆంధ్రా ఎంపీలకూ, మాకూ అదే తేడా: ఎంపీ రాజయ్య
రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ తో కాంగ్రెస్ ఎంపీల భేటీ ముగిసింది. అనంతరం తెలంగాణ ప్రాంత ఎంపీ మల్యాల రాజయ్య మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణపై అధిష్ఠానం ఇకనైనా తేల్చాలని ఆజాద్ కు స్పష్టం చేశామని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ మొదలు పెడితేనే తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ సాగించగలదని కేంద్రమంత్రికి వివరించామని రాజయ్య అన్నారు. ఆంధ్రా ఎంపీలు పదిహేను మంది వరకు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని.. కేంద్రం తెలంగాణ విషయం నాన్చుతున్నా తాము మాత్రం ఇప్పటికీ పార్టీకి విధేయులమై ఉన్నామని రాజయ్య చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పలు సూచనలు చేశామని తెలిపారు.