Jagan: వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదాలు జగన్ కు ఉండాలని కోరుకుంటున్నా: వైసీపీ నేత రోజా
- జగన్ ద్వారా రాష్ట్రం అభివృద్ధి వైపు నడవాలి
- అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
- గతంలో వైసీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ఘనత చిత్తూరు జిల్లాదే: రోజా
శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆశీర్వాదాలు జగన్ కు ఉండాలని, ఆయన ద్వారా రాష్ట్రం అభివృద్ధి వైపు నడవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘జగన్ ప్రజాసంకల్ప యాత్ర నిన్న చిత్తూరు జిల్లాలో ప్రవేశించింది. గత ఎన్నికల్లో చూస్తే వైసీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ఘనత చిత్తూరు జిల్లాదే. ఈసారి కూడా, వైసీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచే ఇచ్చేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు’ అని రోజా అన్నారు.