KCR: తెలంగాణలోని దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపికబురు!

  • దివ్యాంగులకు నూతన సంవత్సర కానుక 
  • వివాహం చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకం లక్షకు పెంపు
  • సంబంధిత ఫైలుపై సంతకం చేసిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు సీఎం కేసీఆర్ నూతన సంవత్సర కానుక ప్రకటించారు. దివ్యాంగులను వివాహం చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రోత్సాహకాన్నిరూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై కేసీఆర్ ఈరోజు సంతకం చేశారు. ఈ నిబంధనల ప్రకారం.. దివ్యాంగుడైన అబ్బాయిని ఏ అమ్మాయి వివాహమాడినా లేక దివ్యాంగురాలైన అమ్మాయిని ఏ అబ్బాయి పెళ్లి చేసుకున్నా వారికి ఈ ప్రోత్సాహకం లభిస్తుంది.  
 

KCR
  • Loading...

More Telugu News