surya: వెనక్కి తగ్గని 'గ్యాంగ్' .. 'జై సింహా'తో పోటీకి సిద్ధం!
- జనవరి 10వ తేదీన 'అజ్ఞాతవాసి'
- జనవరి 12న 'జై సింహా'
- అదే రోజున రంగంలోకి 'గ్యాంగ్'
సూర్య తాజా చిత్రంగా తమిళంలో 'తానా సెరిందా కూట్టమ్' సినిమా రూపొందింది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా కీర్తిసురేశ్ నటించింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను తమిళంలో వచ్చేనెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తెలుగులోను ఈ సినిమాను 'గ్యాంగ్' పేరుతో అదే రోజున విడుదల చేయనున్నారు.
అయితే తెలుగులో సంక్రాంతి కానుకగా బాలకృష్ణ సినిమా 'జై సింహా' కూడా అదే రోజున విడుదలవుతోంది. ఆ సినిమాకి రెండు రోజుల ముందే పవన్ కల్యాణ్ సినిమా 'అజ్ఞాతవాసి' రిలీజ్ అవుతోంది. దాంతో ఈ రెండు సినిమాలకి పోటీగా 'గ్యాంగ్' రాకపోవచ్చనే టాక్ వినిపించింది. కానీ 'గ్యాంగ్' వెనక్కి తగ్గడం లేదన్నది తాజా సమాచారం. అదే రోజున ఆ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో వున్న గట్టి పోటీని తట్టుకుని ఈ సినిమా ఎంతవరకూ నిలబడుతుందో చూడాలి మరి.